జనం న్యూస్ 23 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ఎ ల్లమ్మ కథ జిల్లా జర్నలిస్టుపై దాడి ముందుగా గాయపడిన జర్నలిస్ట్ నర్సింలు గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్ లో పరామర్శించిన కమిటీ సభ్యులు అనంతరం. జిల్లా ఎస్పీ కి వినతి పత్రం అందజేత. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో గద్వాల్ రూరల్ పరిధిలోని సంఘాల చెరువు సమీపంలో రిపోర్టర్ నర్సింహులు పై ఇద్దరు వ్యక్తులు పాత కక్షలు మనసులో పెట్టుకొని దాడి చేసిన సంఘటనపై జిల్లా ఎస్పీ ని కలిసి వినతి పత్రం సమర్పించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు. మరియు ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో జర్నలిస్టులపై దాడులు పునరావతం కాకుండా చూడాలని జిల్లా ఎస్పీ కి వినిపించిన జిల్లా అధ్యక్షుడు బి. గిరిబాబు అధ్యక్షులు మాట్లాడుతూ మన జిల్లాలో చాలా ప్రాంతాలలో వచ్చే న్యూస్ పై అవగాహన లేకుండా కొందరు ప్రజాప్రతినిధులు ఎందరో జర్నలిస్టులను బెదిరింపులకు కూడా గురి చేశారని గుర్తు చేశారు వార్తలు రాసే జర్నలిస్టులపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు. ఉపాధ్యక్షులు సురేష్. ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు. కేబీ. తిమ్మప్ప, టి వీరన్న, మహబూబ్, వరప్రసాద్, ఇలియాస్ జనం న్యూస్ విష్ణువర్ధన్ గౌడ్, సత్యం, రవి ,తదితరులు పాల్గొన్నారు.