జనం న్యూస్ నందలూరు 21 సెప్టెంబర్, 2026ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడు, అభ్యుదయ కవితా పితామహుడు, *”దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్”* అని చాటిన మహాకవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు తెలుగు జాతి గర్వించ దగిన మహనీయుడు అని ఆంధ్ర ప్రదేశ్,రాస్టో పాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి అల్లం అశోక్ కుమార్,కొని యాడారు.పెనగలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో సోమవారం ఉదయం గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లం మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా నివాళులు అర్పించి ఆయన జీవిత విశేషాలను, రచనలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల రెడ్డి, రాఘవ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బాదుషా, జీ. శ్రీనివాసులు, సురేంద్ర, బీ. శ్రీనివాసులు, శ్రీదేవి, లక్ష్మీదేవి, నారాయణమ్మ, పద్మావతి, రేవతి, దేవమణి, రహమతూన్ తదితరులు పాల్గొన్నారు.