తెలంగాణ

చిన్నారుల భరతనాట్య ప్రదర్శనకు ఘన సత్కారం

చిన్నారుల భరతనాట్య ప్రదర్శనకు ఘన సత్కారం

జనం న్యూస్ సెప్టెంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలాజీనగర్‌లోని మన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు లయ బద్ధంగా, ఎంతో చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించడంతో మండపం ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది. చిన్నారుల ప్రతిభను చూసిన భక్తులు, తల్లిదండ్రులు వారిని అభినందించారు.ఈ సందర్భంగా చిన్నారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ మన అసోసియేషన్ సభ్యులు, పోలీస్ శివారెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. చిన్నారులను చిన్ననాటి నుంచే ప్రోత్సహించడం ద్వారా భారతీయ కళలు, సంప్రదాయాలు, సంస్కృతి పట్ల వారిలో మరింత ఆసక్తి పెంపొందుతుందని సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మన అసోసియేషన్ సభ్యులు, భక్తులు, చిన్నారుల తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొని చిన్నారుల నృత్య ప్రదర్శనను వీక్షించారు.

ఇ-పేపర్