తెలంగాణ

గండ్రవానిగూడెంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం జూనియర్ కింగ్స్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు

గండ్రవానిగూడెంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం జూనియర్ కింగ్స్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు

జనం న్యూస్ సెప్టెంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గండ్రవానిగూడెం పడమర బజార్‌లో జూనియర్ కింగ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బొబ్బిలి కావ్య శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్‌లు కర్ర శ్రీనివాస్ రెడ్డి, వల్లపు ముత్తయ్య, విగ్రహ దాత బొబ్బలి నాగరాజు, రమాదేవి తదితరులు హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జంజారాల శ్రీరాములు, వార్డు సభ్యులు, బొబ్బలి వంశీ, గాదె వెంకట్ రెడ్డి, బొబ్బలి సైదులు, బొబ్బలి నరేష్, సిరిగిరి శ్రీధర్ రెడ్డి, చింతకుంట్ల నాగిరెడ్డి, కొప్పుల సాయి రెడ్డి, నల్లగంతుల శేఖర్, వెంకన్న, సరస్వతి, శ్రీలత, రాజేశ్వరి, జయమ్మ, బిట్టు, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని జూనియర్ కింగ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఇ-పేపర్