జనం న్యూస్ నందలూరు కడప జిల్లా అక్టోబర్ 3 ధన్యవాదములు తెలిపిన దేవాలయం నిర్మాణ కమిటీ నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంకి రాజ్యసభ సభ్యులు, MRKR అధినేత మేడా రఘునాథరెడ్డి 3లక్షల విరాళం అందించినట్లు దేవాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు బాలాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 23వ తేదీన ఎంపి మేడా రఘునాథరెడ్డి ని కలిసి దేవాలయం నిర్మాణానికి సహకరించవలెనని కోరగా 3లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన చెప్పినట్లుగా బ్యాంక్ ఖాతాకి 3లక్షల విరాళం పంపినట్లు బాలాంజనేయులు తెలియ చేసారు. ఈ సందర్భంగా ఎంపి మేడా రఘునాథరెడ్డికి దేవాలయం నిర్మాణ కమిటీ ధన్యవాదములు తెలియ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.