జనం న్యూస్ అక్టోబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం నా పై చేస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు అవాస్తవమని మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఇతరుల భూమిని ఒక్క పైసా కూడా ఆక్రమించలేదని, నా భూమిని తీసుకొని తనను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు ఆలయానికి రహదారి కావాలని తనను కోరారని తెలిపారు.వారి విజ్ఞప్తి మేరకు గ్రామం, దేవుడి కోసం తన పొలాన్ని సైతం నష్టపరిచి, గ్రామస్తుల సహకారంతో దారి ఏర్పాటు చేసేందుకు హృదయపూర్వకంగా సహకరించానన్నారు. ఆలయ నిర్మాణం కోసం తన భూమిని కూడా ఇచ్చానని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల భూములకు, తాను ఏర్పాటు చేసిన దారికి ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కూడా ఇదే విధంగా తనను ఇబ్బందులకు గురిచేసి తన భూమిని తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా తన భూమి మొత్తాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి భూమిని ఆక్రమించలేదని తెలియజేశారు.