ఆంధ్రప్రదేశ్

గజ్వేల్ కాలేజీ బీసీ బాలికల అదనపు వసతి గృహ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలి

గజ్వేల్ కాలేజీ బీసీ బాలికల అదనపు వసతి గృహ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలి

వెనుకబడిన తరగతుల జిల్లా అధికారికి వినతి పత్రం జనం న్యూస్ ; 4 అక్టోబర్ ఆదివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;గజ్వేల్ పట్టణంలోని కాలేజీ బీసీ బాలికల అదనపు వసతి గృహానికి కేటాయించిన బిల్డింగ్ పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల జిల్లా అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు నాచారం శేఖర్, గుడికందుల రవి మాట్లాడుతూ గజ్వేల్ కాలేజీలో చదువుతున్న బీసీ విద్యార్థినులకు సరిపడా వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా వసతి గృహంలో గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థినుల సౌకర్యార్థం అదనపు వసతి గృహ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, పనులు పూర్తికాకపోవడంతో ఆ భవనం వినియోగంలోకి రాలేదని పేర్కొన్నారు. దీంతో విద్యార్థినులు అందుబాటులో ఉన్న పరిమిత వసతి సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా బీసీ విద్యార్థినులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు వసతి గృహాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అందువల్ల సంబంధిత అధికారులు బిల్డింగ్ పనులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయించి, అన్ని మౌలిక సదుపాయాలతో విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుట్ల వినయ్ కుమార్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్