
శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పెద్ద ముత్తెన్నకు పరామర్శ
జనం న్యూస్, అక్టోబర్ 04: కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే తన బాధ్యత అన్నట్లుగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఏర్గట్ల మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బద్దం సంజీవ్ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం ఇబ్రహీంపట్నానికి చెందిన పెద్ద ముత్తెన్న హైదరాబాద్‌లో కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను కూడా ముత్యాల సునీల్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ మాట్లాడుతూ ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, సంజీవ్ యాదవ్, జింక అనిల్ యాదవ్, రెండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, బద్దం మారుతి, ముస్కు నర్సింగ్, కూరాకుల బొర్రన్న, దండేవోయిన సాయన్న, దండేవోయిన సాయి, బద్దం ముత్యం, ఎస్కే రషీద్, ఎస్కే సలీం, బద్దం జిత్తు, ఎస్కే గాపూర్, రాజారాం సహదేవ్, పాకల ప్రసాద్ గౌడ్, దొబ్బల చిన్న కిషన్, రావుల నగేష్, బోడ గణేష్, ఇబ్రహీంపట్నం చిన్న ముత్తెన్న, గుమ్మిర్యాల్ అనిల్ యాదవ్, నిమ్మ గణేష్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.