తెలంగాణ

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ పోస్టులు విడుదల.

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ పోస్టులు విడుదల.

కూకట్‌పల్లి నియోజకవర్గ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్‌గా మట్టే ప్రసన్న కుమార్ నియామకం

జనం న్యూస్ అక్టోబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన నూతన పోస్టులు విడుదలైన సందర్భంగా, కూకట్‌పల్లి నియోజకవర్గ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్‌గా మట్టే ప్రసన్న కుమార్ ఈరోజు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీ హేమదుర్గా భవన్‌లో నియామక పత్రాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ నూతనంగా నియమితులైన మట్టే ప్రసన్న కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల హక్కులు మరియు సంక్షేమం కోసం కృషి చేస్తూ పార్టీకి మరింత సేవలందించాలని బండి రమేష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ డిపార్ట్‌మెంట్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్