వడ్డేపల్లి రాజేశ్వరరావును కలిసి ఆశీస్సులు తీసుకున్న వినోద్ కుమార్
జనం న్యూస్: అక్టోబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అర్బన్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా కోడిచెర్ల వినోద్ కుమార్ నియమితులైన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు వినోద్ కుమార్‌ను అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఓబీసీ మోర్చా బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఖైతలాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పాల్గొని వినోద్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.