ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి కబడ్డీలో వనపర్తి రెండవ బహుమతి

రాష్ట్రస్థాయి కబడ్డీలో వనపర్తి రెండవ బహుమతి

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ 06-10-2026 మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్ కబడ్డీ బాలుర విభాగంలో మన వనపర్తి జిల్లా జట్టు రెండవ బహుమతిని కైవసం చేసుకున్నది.
చైర్మన్ గా పద్మజా రెడ్డి గారు, అధ్యక్షులుగా వెంకటేశ్వర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీగా కురుమయ్య గారు అయినప్పటినుండి 33 జిల్లాలలో మన వనపర్తి జిల్లా మొదటి & రెండవ స్థానంలోనే ప్రతిసారి నిలుస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు* జిల్లాలో సెలక్షన్స్ జరిగిన ప్రతిసారి క్యాంపులు నిర్వహించి ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం వల్లే విజయాలకు కారణం. కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ ని, సీనియర్ క్రీడాకారులని నిత్యం ఏకం చేస్తూ తద్వారా క్రీడాకారులలు స్ఫూర్తిని కలిగిస్తూ. అసోసియేషన్ ఏర్పడిన రెండు సంవత్సరాల లోనే రాష్ట్ర స్థాయిలో 6సార్లు మొదటి, రెండు స్థానాలను జిల్లాకి అందించి, ప్రశంసలు అందుకుంటున్న ఘనత మనది *కావున మన కబడ్డీ అసోసియేషన్ అందరికీ, కోచ్ లకు, క్రీడాకారులకు క్రీడాభివందనాలు.

ఇ-పేపర్