జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 6. తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన ఎస్ ఎం సి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ ముక్కర కరుణాకర్ పాఠశాల మీద, విద్యార్థుల మీద మక్కువతో 22 వేల రూపాయలు విలువగల కూలింగ్ వాటర్ ప్యూరిఫైలు రెండు బహుకరించారు. అందులోనే చిన్న రిఫ్రిజిరేటర్లు కూడా ఉన్నాయి. మూడు బబుల్స్, అలాగే టాయిలెట్స్ మరియు సింకులలో రిపేర్ ఉన్న కొళాయిలు అన్ని కొత్తవి తీసుకురావడం జరిగింది. వాటి ఖరీదు 3000 రూపాయలు. మొత్తం 25 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రెండు క్లాసు రూముల్లో ఉపయోగపడే విధంగా రెండు ప్యూరిఫైయర్లు తేవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు మాట్లాడుతూ పాఠశాల మీద గౌరవం, అలాగే తను చదువుకున్న స్కూలు, ఏదో నా వంతుగా చేయాలన్న తపనతో తన మొదటి కార్యక్రమంగా ఇవి ఏర్పాటు చేయడం అభినందనీయం. పాఠశాలకు ఇంకా ఏమి అవసరం ఉంది సార్ అని అన్ని వివరాలు తెలుసుకోవడం అతని నిబద్ధతకు నిదర్శనం. ఇలాంటి వ్యక్తులు పాఠశాల చైర్మన్గా ఎన్నిక కావడం, అది కూడా గెలిచిన వారానికే ఈ కార్యక్రమం చేయడం శుభ పరిణామం. మున్ముందు తన వంతు సహకారాన్ని అన్ని రకాలుగా అందిస్తానని చైర్మన్ ముక్కర కరుణాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముక్కర కరుణాకర్, ముక్కర. కాశయ్య , ఎస్ ఎం సి సభ్యులు ముక్కర గాలెయ్య, తంగిరాల. రమేష్, తంగిరాల రవి, కటారి డేవిడ్, అలాగే చైర్మన్ కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయిని యం అనూష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.