ఆంధ్రప్రదేశ్

దీప్తి 28వ పుట్టినరోజు సందర్భంగా పోచమ్మ దేవాలయంలో మహా అన్నదానం. 300 మందికి పైగా అయ్యప్ప, భవాని స్వాములకు అన్నదానం

దీప్తి 28వ పుట్టినరోజు సందర్భంగా పోచమ్మ దేవాలయంలో మహా అన్నదానం. 300 మందికి పైగా అయ్యప్ప, భవాని స్వాములకు అన్నదానం

జనం న్యూస్, అక్టోబర్ 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ మంజీరా మాల్ సమీపంలోని పోచమ్మ దేవాలయంలో మట్టపర్తి శ్రీనివాసరావు, పద్మజ దంపతుల కుమార్తె దీప్తి 28వ పుట్టినరోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాంబాబు గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవాని స్వాములతో పాటు భక్తులు సుమారు 300 మందికి పైగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాంబాబు బొట్టు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తేదీన అయ్యప్ప, భవాని స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. స్వాములకు ఇతర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ప్రారంభం కాకముందే ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. పోచమ్మ దేవాలయం గతంలో అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఉండేదని, తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం భక్తులు, స్థానికుల సహకారంతో దేవాలయం అభివృద్ధి సాధించిందని రాంబాబు గురుస్వామి తెలిపారు. దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దీప్తి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని చాటుకున్నారని పలువురు భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, భవాని స్వాములు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్