జనం న్యూస్ ;10 అక్టోబర్ శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయములో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల కోసం పాఠశాల ప్రాంగణాన్ని సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులలో హాజరై పండుగ శోభను తీసుకువచ్చారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రకరకాల ప్రకృతి సిద్ధమైన పూలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందంగా పేర్చిన బతుకమ్మలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది. ఇటువంటి వేడుకల ద్వారా నేటి యువతరానికి మన సాంప్రదాయాలను, ప్రకృతిని గౌరవించడాన్ని అలవాటు చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత,ఉపాధ్యాయినిలు రత్నమాల,భాగ్యమ్మ, ఫిర్దోజ్, కృష్ణవేణి, సృజన,మానుష,అరుణ పాల్గొన్నారు.