జనం న్యూస్ అక్టోబరు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సద్దుల బతుకమ్మ వేడుకలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ చింతల ఉమా-రవిపాలు, ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మండల కేంద్రంలోని తాళ్లకుంట సమీపంలో శుక్రవారం రోజున జేసీపి సాయంతో గడ్డి, పిచ్చిమొక్కలను తొలగించి స్థలాన్ని శుభ్రం చేయించారు సద్దుల బతుకమ్మలు పేర్చేందుకు, మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఆటపాటలతో పండుగను ఆనందంగా జరుపుకునేందుకు వీలుగా పరిసరాలను సిద్ధం చేయించారు. పండుగకు వచ్చే మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఈ పనుల్లో వార్డు సభ్యులు 7 వ వార్డ్ మెంబర్ కొత్తపల్లి రవీందర్, 5 వ వార్డ్ మెంబర్ తట్ల ప్రవళిక-సాయి తదితరులు సహకరించారు….