జనం న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం, భరత్ నగర్ కాలనీలో పలు దుర్గ మాత మండపాలని జనసేన పార్టీ తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సందర్శించారు.
మండప నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మరియు నిర్వాహకులు ప్రేమ కుమార్ ని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరిపై, అలాగే రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో, ఐక్యతతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వర్రే నాగరాజు, శ్రీనివాస గోవిందా, దాసరి వెంకట్, మరియు కార్యకర్తలు మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు.