ఆంధ్రప్రదేశ్

ఆడపడుచుల ఐకమత్యానికి ప్రతీక బతుకమ్మ!

ఆడపడుచుల ఐకమత్యానికి ప్రతీక బతుకమ్మ!

జనం న్యూస్ ;16 అక్టోబర్ శుక్రవారం. సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై. రమేష్; తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆడపడుచుల ఐకమత్యానికి నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మలను అందంగా అలంకరించి, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ మహిళలందరినీ ఒకచోట చేర్చి, ఆప్యాయతలు, అనుబంధాలు, ఆనందాలను పంచుకునే ఆత్మీయ వేడుకగా నిలుస్తుంది. పూల సోయగాలు, జానపద గీతాలు, సంప్రదాయ ఆటపాటలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకుంటాయి. పూలలో అందం. పాటల్లో ఆనందం. ఆడపడుచుల ఐకమత్యంలోనే బతుకమ్మ పండుగ అసలైన గొప్పతనం.

ఇ-పేపర్