ఆంధ్రప్రదేశ్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తాండూరులో సైకిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తాండూరులో సైకిల్ ర్యాలీ

జనం న్యూస్ అక్టోబర్ 16 వికారాబాద్ జిల్లా :- పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, ఐపీఎస్ పాల్గొని తాండూరు పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తాండూరు డీఎస్పీ నర్సింహయ్య, తాండూరు డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి ఈ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు సైకిల్ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవలు మరియు దేశ రక్షణలో వారు అందించిన అమూల్యమైన సహకారాన్ని ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో పాటు పోలీస్ శాఖ పట్ల గౌరవభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అదనపు ఎస్పీ తెలిపినారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా అదనపు ఎస్పీ తెలిపినారు.

ఇ-పేపర్