తెలంగాణ

ఘనంగా చిన్నారి అన్విక ప్రథమ జన్మదిన వేడుకలు.

ఘనంగా చిన్నారి అన్విక ప్రథమ జన్మదిన వేడుకలు.

వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి దంపతులు జనం న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన మిత్రుడు, స్నేహితుడు సీహెచ్ వెంకటరాజు కళ్యాణ్ దంపతుల కుమార్తె, తెలంగాణ రాష్ట్ర ఇన్‌కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రాకేష్ దంపతుల చిన్నారి అన్విక ప్రథమ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరై చిన్నారి అన్వికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి దంపతులు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జనంపల్లి పురంధర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ. చిన్నారి అన్విక ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. చక్కటి విద్యాబుద్ధులు అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దీవించారు. చిన్నారి ప్రథమ జన్మదిన వేడుకలతో హోటల్ దస్పల్లా ప్రాంగణం సందడిగా మారింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బి. తాండవ కృష్ణ, జి. నర్సింగ్ రావు, శ్రీధర్, సాంబశివరావు, సూర్యనారాయణ, గణేష్ తదితరులు పాల్గొని చిన్నారి అన్వికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇ-పేపర్