ఆంధ్రప్రదేశ్

ఆయిల్ పామ్ రైతులకు శిక్షణ

ఆయిల్ పామ్ రైతులకు శిక్షణ

ఎల్‌ నినో పరిస్థితుల్లో పంట నిర్వహణ, నీటి యాజమాన్యంపై అవగాహన సదస్సు జనంన్యూస్ అక్టోబర్ 16: నిజామాబాద్ జిల్లా ఏర్గటమండలంలోని ఆయిల్ పామ్ రైతులకు ఉద్యాన శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్ర వారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత ఎల్‌ నినో పరిస్థితుల్లో పంట నిర్వహణ, నీటి యాజమాన్యం, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆయిల్ పామ్ తోటల్లో దీర్ఘకాలికంగా దిగుబడులు తగ్గకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు నీటిని అందించడం ద్వారా పంటకు అవసరమైన తేమను కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయిల్ పామ్‌లో పరాగసంపర్కానికి సహకరించే పురుగుల కార్యకలాపాలు తగ్గకుండా, చెట్ల చుట్టూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో పంటకు నీటి సరఫరా, తేమ నిర్వహణతో పాటు ఇతర ముఖ్యమైన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, కంపెనీ ప్రతినిధులు సాయికిరణ్, రాజేందర్, గడ్డం లింగారెడ్డి, గుండెటీ చంద్ర శేఖర్, కొప్పేల మారుతి రెడ్డి, సోమ గంగారెడ్డి, క్యాతం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలువురు ఆయిల్ పామ్ రైతులు హాజరయ్యారు.

ఇ-పేపర్