జనం న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భరత్ నగర్ కాలనీలో నాగిరెడ్డి ఆహ్వానం మేరకు, మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో తూము మనోజ్ ఆహ్వానం మేరకు, బాలాజీ నగర్లో కృష్ణ రాజ్పుత్ ఆహ్వానం మేరకు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, ఐకమత్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భక్తులు, మహిళా నాయకురాళ్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.