ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి బలం జనం న్యూస్ అక్టోబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ముమ్మిడివరం మాజీ సర్పంచ్ మట్ట రాంబాబు శుక్రవారం మురమళ్లలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముమ్మిడివరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మట్ట రాంబాబుకు పార్టీ కండువా కప్పి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దాట్ల పృథ్వీరాజ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లు అశోక్, ముమ్మిడివరం మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల్ల కోటి దొరబాబు, టీడీపీ ఐ పోలవరం అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు తదితర కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.*