ఆంధ్రప్రదేశ్

పాడి రైతుల సంక్షేమమే మదర్ డైరీ లక్ష్యం .ఐలి కృష్ణ గౌడ్

పాడి రైతుల సంక్షేమమే మదర్ డైరీ లక్ష్యం .ఐలి కృష్ణ గౌడ్

జనం న్యూస్ 16. ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పాడి రైతుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్‌ మదర్ డైరీ ముందుకు సాగుతోందని కొల్లూరు పాల సంఘం చైర్మన్ ఐలి కృష్ణ గౌడ్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని కొల్లూరు గ్రామంలో పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు బోనస్ అందజేసి పాడి రంగంలో రైతుల కృషిని అభినందించారు. మాట్లాడుతూ. పాడి రైతుల సంక్షేమం కోసం మదర్ డైరీ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తోందని రైతులకు పశువుల దాణాను సబ్సిడీపై అందజేస్తున్నామని, గతంతో పోలిస్తే పాల ధరలను కూడా పెంచడం జరిగిందని పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు, పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పాడి రైతులు నాణ్యమైన పాలను ఉత్పత్తి చేస్తూ సహకార రంగాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా మదర్ డైరీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ) సహకారంతో పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం, పశుపోషణ ఖర్చులను తగ్గించడం, పాల ఉత్పత్తిని పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా బోనస్ పంపిణీ చేయడం పాడి రైతుల్లో ఆనందాన్ని నింపిందని, పండుగ వేళ రైతులకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పాల సంఘం అభివృద్ధికి సహకరిస్తున్న రైతులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగామ సుధాశ్రీ పాల్ రెడ్డి, పాల కేంద్రం మేనేజర్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాజుల దశరథ, మాజీ వైస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, గ్రామ పెద్దలు, మాజీ పాల సంఘం చైర్మన్ పిల్లమరి శంకరయ్య, సంఘం డైరెక్టర్లు పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

ఇ-పేపర్