జనం న్యూస్ అక్టోబర్ 17 కోటబొమ్మాళి మండలం :ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లి మూడు రోజుల జాతర ఉత్సవాల ఆదాయం 27 లక్షల 09, 639 రూపాయలు లభించినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హుండీలను దేవాదాయశాఖ అధికారులు, గ్రామ పెద్దలు సమక్షంలో తెరిచి లెక్కించారు. ఈ ఆదాయం హుండీల ద్వారా 14 లక్షల 338 రూపాయలు, దర్శన టికెట్ల ద్వారా 6 లక్షల 66,800 రూపాయలు, విరాళాల ద్వారా 5.001 రూపాయి, పులిహోర ప్రసాదం ద్వారా 1,49,130 రూపాయలు, లడ్డూ ప్రసాదం ద్వారా 4.85.400 రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది 5.01.158 రూపాయలు అదనంగా పెరిగిందని ఆయన వివరించారు. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో శ్రీకాకుళం దేవాదాయశాఖ ఏ.సి బి.ఆర్. వి. వి. ప్రసాద్ పట్నాయక్, రాయవలస దేవాలయ ఈ.వో. గురునాధరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ కోరాడ గోవిందరావు, గ్రామ పెద్దలు బోయిన రమేష్, ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. కాగా ఈ ఉత్సవాలకు అన్ని విధాల సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పోలీసులకు ఈవో రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.