ఆంధ్రప్రదేశ్

ధర్మాజీపేటలో వైభవంగా మహాశక్తి అమ్మవారి పూజలు

ధర్మాజీపేటలో వైభవంగా మహాశక్తి అమ్మవారి పూజలు

జనం న్యూస్ ; 17 శనివారం : సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ ; సిద్దిపేట: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ధర్మాజీపేటలో కొలువుదీరిన మహాశక్తి అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహాశక్తి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్