పండుగ వేళ చెరువుల వద్ద, అప్రమత్తంగా ఉండాలి బిచ్కుంద అక్టోబర్ 17 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా యువత డీజే కార్యక్రమాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువుల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలు నీటిలోకి దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ఆకాంక్షించారు.