జనం న్యూస్ అక్టోబర్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాలలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లును ఆడపడుచులు అత్యంత పవిత్రమైన పండుగగా భావిస్తూ కుటుంబ సభ్యులందరూ పిల్లలు కలిసి బతుకమ్మ పండుగ మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళలు ఇంటి ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ సంబరాలలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రౌండ్స్ ను శుభ్రం చేయించి, డీజే ను ఏర్పాటు చేసి ఆడపడుచులు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఇంటి నుండి అట్టహాసంగా బయలుదేరారు. రకరకాల పాటలతో హోరెత్తిస్తున్న ఆటపాటలతో గ్రామాలలోని బతుకమ్మ ఆటస్థలం పరిసర ప్రాంతాలు సందడిగా నెలకొన్నాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రకరకాల పాటలతో నృత్యాలతో విన్యాసాలు చేస్తూ ఆనందంగా ఉత్సాహంగా పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు.