మద్నూర్,అక్టోబర్ 19 జనం న్యూస్ ): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా అధికారులు సమయపాలన పాటించకపోవడం తో ప్రజలు అసహానం వ్యక్తం చేసారు .ఉదయం 11 గంటల వరకు పరిశీలిస్తే ప్రజావాణి హాల్ లో కేవలం ఎంపీడీఓ ఇంచార్జి, తహసీల్దార్ , ఏపీఓ, ఏపీఎం, సమయానికి వచ్చారు .ఎంఈఓ సిబ్బంది మిగతా కొన్ని కార్యాలయ సిబ్బంది మాత్రమే హాజరయ్యారు, మిగతా శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు.ఈ సందర్భంగా స్థానిక ఎంపీడీఓ మాట్లాడుతూ, ప్రజావాణి అనేది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం, అధికారులందరూ సమయానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కరించాలని, అధికారులు సమయపాలన పాటిస్తే బాగుంటుందని కోరరు .ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.