జనం న్యూస్ నవంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బి ఎల్ వో లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు గత మూడు నెలల నుండి నిర్వహించిన ఓటరు సమగ్ర సర్వే నిర్వహించారు అనంతరం బి ఎల్ వో ల డబ్బులు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు తమ తమ ఖాతాలో డబ్బులు జమ అయినప్పటికీ కేవలం భూపాల్ పల్లి నియోజకవర్గంలోని బీఎల్ఓ లకు ఇట్టి డబ్బులు జమ కాకపోవడం వలన భూపాల్ పల్లి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందిస్తూ వారం రోజుల్లో మీ గౌరవ భృతి డబ్బులు మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ భరోసా కల్పించారు. గత సంవత్సరం కాలం నుండి రావలసిన ఆరువేల రూపాయలు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలోని ఎనిమిది వేల రూపాయలు తక్షణమే (బి ఎల్ వో ల)మా ఖాతాలో జమచేయాలని బి ఎల్ వోల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వంగేటి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గత సంవత్సర కాలం నుండి డబ్బులు రాకపోవడం వలన మా కుటుంబాలు దీనస్థితి పరిస్థితుల్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ధైనంపెళ్లి జోష్ణ కార్యదర్శి తడక భాగ్య, శ్వేత స్వర్ణలత సత్యవేణి స్వరూప రాణి ,కళ్యాణి, వజ్ర,సమ్మక్క,తదితరులు పాల్గొన్నారు.