జనం న్యూస్ సెప్టెంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి రోడ్ నంబర్ 5 నందు వినాయక చవితి నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణేష్ మంటపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక నాయకులు,ప్రముఖులు కొండల్ మరియు రాజి రెడ్డి,నలిని కుమార్ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానం మేరకు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రేమకుమార్ అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నసమారాధన (మహా అన్నదాన) కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మాట్లాడుతూ: “సిద్ధిబుద్ధుల ప్రదాత అయిన ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన కొండల్ కి మరియు ఉత్సవ కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, బోలిబోయిన శ్రీనివాస్, దాసరి వెంకట్, గోపాల్ కృష్ణ, నీరజ్ కుమార్,స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు, కాలనీవాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.