వ్యవసాయ అధికారుల ఆదేశం జనం న్యూస్ సెప్టెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న గ్రామాలలో కొనసాగుతున్న పంటల సర్వే ప్రక్రియను వ్యవసాయ అధికారి వైష్ణవ్, విస్తీర్ణ అధికారి మనీషా మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో చేపడుతున్న పంటల సర్వేను గడువులోగా పూర్తిచేయాలని గ్రామ వాలంటీర్లను ఆదేశించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి రైతు సాగు చేసిన పంట వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. పంటల సర్వేకు రైతులు సహకరించి, తమ పొలాల్లో సాగు చేసిన పంటల వివరాలను వాలంటీర్లకు అందించాలని అధికారులు కోరారు.