ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయిలో పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు యూనిఫాంలు అందజేసిన ఏ సి పి సతీష్ బాబు

జిల్లా స్థాయిలో పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు యూనిఫాంలు అందజేసిన ఏ సి పి సతీష్ బాబు

జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలిసుల సహకారంతో నరసింహా రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలలో క్రీడా మైదానంలో నిర్వహించిన ఎస్ జీ ఎఫ్ మండల స్థాయి యు/14, యు/17 సంవత్సరాల ఖో-ఖ, కబడ్డీ వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన 144 మంది బాలబాలికలకు స్పోర్ట్స్ యూనిఫార్మ్‌లను అందజేసిన పరకాల ఏ సి పి చిర్ర సతీష్ బాబు పరకాల రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్, ట్రస్ట్ ప్రతినిధి ప్రశాంత్ , క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫార్మ్‌లను అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో మరింతగా రాణించి మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ జేడ్ పి ఎచ్ ఎస్ బాలుల ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ , పి డి డాక్టర్. సూరం రామ్ రెడ్డి తరంగిణి , గీత జ్యోతి , ధన్‌పాల్ హాజరై జిల్లా స్థాయికి ఎంపికైన 144 మంది బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

ఇ-పేపర్