ఆంధ్రప్రదేశ్

ఖైతాలాపూర్ డివిజన్‌లో వీధి దీపాల సమస్యపై బీజేపీ నిరసన

ఖైతాలాపూర్ డివిజన్‌లో వీధి దీపాల సమస్యపై బీజేపీ నిరసన

జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కైలాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వీధి దీపాలు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైతాలాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.డివిజన్‌లోని అనేక కాలనీలలో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గణేష్ నిమర్జన కార్యక్రమాల సందర్భంగా వెలుతురు లేక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని రాజేశ్వరరావు తెలిపారు.
అదేవిధంగా చీకటిని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు అవకాశం ఏర్పడుతోందని, మాదకద్రవ్యాలు సేవించి తిరిగే వ్యక్తుల కారణంగా రాత్రివేళల్లో విధులు ముగించుకుని వెళ్లే మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలపై ప్రజలు ఇప్పటికే పలుమార్లు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు అధికారులకు వినతిపత్రం అందజేసి, ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు.నిరసన కార్యక్రమానికి స్పందించిన సంబంధిత అధికారులు వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు, వీధి దీపాల మరమ్మతులు మరియు అవసరమైన పనులను తక్షణమే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖైతాలపూర్ డివిజన్ నాయకులు ఐలయ్య యాదవ్, కోడిచెర్ల వినోద్, శేఖర్ గుప్తా, పండుగ రేణుక, జీవన్, ఈ.సాయి ప్రసాద్, శ్రీనివాస్ చారి, శివా చారి, వంశీ నేత, నాని, సితారం, అనిత, కృష్ణ, కిరణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్