వెలిగొండ ప్రాజెక్టును సందర్శించాలని విజ్ఞప్తి-తప్పక సందర్శిస్తానన్న భువనేశ్వరి జనం న్యూస్ సెప్టెంబర్23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని బుధవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి, ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో గత ఐదారు సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాల్లో, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ భక్తులకు చేపట్టిన వైద్య శిబిరాలు,మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు,కొవిడ్ సమయంలో శానిటైజేషన్,మాస్కుల పంపిణీ వంటి సేవల గురించి డాక్టర్ ఏలూరి భువనేశ్వరికి వివరించారు. సంస్థ సేవలను తెలుసుకున్న భువనేశ్వరి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక మార్కాపురం జిల్లా ప్రకటనతో పాటు అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను జలాశయంలోకి ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని ఏలూరి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును సందర్శించాలని ఏలూరి చేసిన విజ్ఞప్తికి తప్పక సందర్శిస్తానని భువనేశ్వరి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వనబాక లక్ష్మి,శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్, కూటమి నాయకులు పాల్గొన్నారు.