తెలంగాణ

చిలిపి చెడు మండలంలో

చిలిపి చెడు మండలంలో

తొమ్మిదవ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని పలు గ్రామాలలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందిసందర్భంగ సోమక్కపేట హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలు రెడీ చేసిన ఫుడ్ స్టాల్ ని పరిశీలించితక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక పదార్థాలున్న ఆహారాలను ఎంపిక చేసి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుర్గాచలం ఎం ఆర్ ఓ శివ శంకర్ స్థానిక ఎస్సై నర్సింలు స్కూల్ చైర్మన్ పంచాయతీ కార్యదర్శి హై స్కూల్ టీచర్స్ అందరూ అంగన్వాడీ టీచర్స్, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది. చివరగా పోషణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈరోజు అన్ని హైస్కూలలో అంగన్వాడీ టీచర్స్, పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగింది.

ఇ-పేపర్