జనం న్యూస్ అక్టోబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు ప్రతిష్ఠించనున్న దుర్గాభవాని అమ్మవారి విగ్రహానికి గ్రామస్తులు, మహిళలు మంగళారతులు తో భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు.డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని.ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కోలాటం, భజన, సంకీర్తన కార్యక్రమాలతో ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం విజయదశమి రోజున రావణాసుర దహనం, జమ్మి పూజ తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. అని సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు…..