ఆంధ్రప్రదేశ్

ఒడిస్సాలో మన రైతుల ధాన్యం కొనుగోలుపై అనపర్తి ఎమ్మెల్యే, ఎంపీ చొరవ

ఒడిస్సాలో మన రైతుల ధాన్యం కొనుగోలుపై అనపర్తి ఎమ్మెల్యే, ఎంపీ చొరవ

జనం న్యూస్ ఆగస్టు 27 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ఒడిస్సాలో వరి పండిస్తున్న అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన రైతుల ధాన్యాన్ని ఒడిస్సా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ వారం క్రితం ఆ రైతులు వినతిపత్రం అందజేసి సమస్యను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే స్పందించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ ద్వారా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి సమస్యను తెలియజేశారు. ఈరోజు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నివాసం వద్ద అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన రైతుల సమస్యను పురందేశ్వరి ఒడిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర R&B మినిస్టర్ పృథ్విరాజ్ హరిచందన్, ఒడిస్సా రాష్ట్ర సివిల్ సప్లయిస్ మినిస్టర్ కృష్ణ చంద్ర పాత్ర దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వివరించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒడిస్సా రైతుల సమస్యను తెలుసుకోవడానికి సెప్టెంబర్ 3వ తారీఖున కలవాలని ఒడిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. ఒడిస్సాలో ఉన్న రైతులు ఒడిస్సా రాష్ట్ర R&B మినిస్టర్ పృథ్విరాజ్ హరిచందన్, ఒడిస్సా రాష్ట్ర సివిల్ సప్లయిస్ మినిస్టర్ కృష్ణ చంద్ర పాత్రలను కలిసి సమస్యను తెలియజేయాలని అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒడిస్సా రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలకు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఒడిస్సా రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇ-పేపర్