జనం న్యూస్, అక్టోబర్ 07,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ, రోడ్లు.బీటీ రోడ్ల నిర్మాణానికి మొత్తం 26 పనులు మంజూరయ్యాయి. వీటి అంచనా వ్యయం రూ.5.11 కోట్లు…మంజూరైన అభివృద్ధి పనులకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు. పల్లెల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు చెప్పారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనులు మంజూరయ్యాయి..అచ్యుతాపురం మండలంలోని చీమలాపల్లిలో 3 పనులకు రూ.95 లక్షలు, తిమ్మరాజుపేటలో ఒక పనికి రూ.20 లక్షలు, ఎం.జె.పురంలో 2 పనులకు రూ.40 లక్షలు, రామన్నపాలెంలో 2 పనులకు రూ.40 లక్షలు, మడుతూరులో 2 పనులకు రూ.30 లక్షలుఅదేవిధంగా కొండకర్లలో రూ.20 లక్షలు, ఎర్రవరంలో రూ.15 లక్షలు, దొప్పెర్లలో రూ.20 లక్షలు, భోగాపురంలో రూ.15 లక్షలు, ఖాజీపాలెంలో రూ.20 లక్షలు, రాజానపాలెంలో రూ.20 లక్షలు అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు.దోసూరులో 2 పనులకు రూ.18 లక్షలు, ఆవరాజంలో 3 పనులకు రూ.65 లక్షలు, జి.ధర్మవరంలో రూ.10 లక్షలు, నునపర్తిలో రూ.15 లక్షలు, పూడిమడకలో 2 పనులకు రూ.48 లక్షలు, పెదపాడులో రూ.20 లక్షలు కేటాయించారు…ఈ కార్యక్రమంలో డిఇఇ లు ఏ శ్రీనివాసరావు, డి. వీరభద్రరావు, మండల ప్రత్యేక అధికారి ఎం .యశ్వంత్ ఎంపీడీఒ, మండల ఇంజనీరింగ్ అధికారి పైడమ్ నాయుడు , ఇతర అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.