జనం న్యూస్ అక్టోబర్ 5 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలంలోని దండెపల్లి గ్రామంలో పంచరాయి భూముల పరిరక్షణ కోసం గ్రామ రైతులు, భూమి హక్కుదారులతో కలిసి పంచరాయి భూమి సంరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తండపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 429కు సంబంధించిన భూములను పరిరక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు రైతులు తెలిపారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ భూములకు సంబంధించిన పట్టా పుస్తకాలు, హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, తమ భూములను ఇతరులకు కట్టబెట్టేందుకు లేదా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగితే సహించబోమని అన్నారు. భూముల పరిరక్షణ కోసం అవసరమైతే గ్రామస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.కమిటీ అధ్యక్షుడిగా కామెర లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలిగా జూపాక రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం సంద్య సహాయ కార్యదర్శిగా సరోజన, కమిటీ సభ్యులుగా జన్నుబాయి, సాంబయ్య, గడ్డం సులోచన, మారుపాక ప్రమీల తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు.తండపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 429 భూములకు సంబంధించి రైతుల హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పనిచేస్తామని కమిటీ అధ్యక్షుడు కామెర లక్ష్మణ్ తెలిపారు. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు భూముల వివరాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.