ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గణిత ఫార్ములా పుస్తకాలను పంపిణీ చేస్తున్న – యల్లపు జయలక్ష్మి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గణిత ఫార్ములా పుస్తకాలను పంపిణీ చేస్తున్న – యల్లపు జయలక్ష్మి

జనం న్యూస్ ఆగస్టు 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : యల్లపు సత్యనారాయణ, రిటైర్డ్ హిందీ మాస్టర్ 80వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి యల్లపు జయలక్ష్మి గవరపాలెం గర్ల్స్ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు గణిత ఫార్ములా పుస్తకాలను బహూకరించమని యల్లపు ప్రసాద్ తెలియజేశారు. 10వ తరగతి విద్యార్థులకు గణితంపై మరింత అవగాహన పెంపొందించి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడే విధంగా ఈ గణిత ఫార్ములా పుస్తకాన్ని గణిత ఉపాధ్యాయులు యల్లపు డి.వి.కె. ప్రసాద్ రూపొందించారని భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు సులభంగా గణిత సూత్రాలను గుర్తుంచుకొని, సమస్యలను వేగంగా సాధించేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గణిత ఫార్ములా రూపొందించిన ప్రసాద్ అన్నారు. యల్లపు సత్యనారాయణ జ్ఞాపకార్థం విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విధంగా పుస్తకాలను అందించడం అభినందనీయమని గవరపాలెం గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బి జగన్నాథరావు అన్నారు. అదేవిధంగా గరపాలెం హైస్కూల్లో భీమినిగుమ్మం అంబేద్కర్ హైస్కూల్లో గణిత ఫార్ములా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుబిల్లి నరసింహారావు లలిత కుమారి హెడ్మాస్టర్ సిహెచ్ మహాలక్ష్మి సిహెచ్ వి రమణ కాండ్రేగుల జనార్ధన్ సూర్యనారాయణ నాగేశ్వరరావు దాడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.//

ఇ-పేపర్