తెలంగాణ

ప్రజావాణి పై, నమ్మకం పోయిందా?.

ప్రజావాణి పై, నమ్మకం పోయిందా?.

జనం న్యూస్, 12 అక్టోబరు, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా . సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలకేంద్రంలోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం పై, ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందా?. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుండి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి, ప్రజలు రాకపోవడంతో, ఝరాసంగం లోని, మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఖాళీగా దర్శనమిచ్చింది. ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కి సంబంధించిన ఆ యా శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. కానీ ఫిర్యాదు చేయడానికి ఒక్కడు మాత్రమే వచ్చాడు. దీనితో కుర్చీలో కూర్చున్న అధికారులు, ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఫోటోలో కనిపిస్తున్న దృశ్యమే, ఇందు కు నిదర్శనం. గతంలో ఇచ్చిన దరఖాస్తులకు, పరిష్కారం లభించకపోవడమే, ప్రజలు ప్రజావాణికి దూరం అవ్వడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించి, ప్రజలకు ప్రభూత్వ అధికారులు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇ-పేపర్