తెలంగాణ

రాఘవ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

రాఘవ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

జనం న్యూస్ 9 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలో శుక్రవారం రోజున రాఘవ స్వచ్ఛంద సేవా పలు ఆసుపత్రుల ఆధ్వర్యంలో మేఘా వైద్య శిబిరం నిర్వహించారు రాఘవ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సందర్భంగా తమ సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని వైద్య శిబిరంలో 180 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 50 మందికి మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు గుర్తించడంతో తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యం అని చెప్పారు వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన పలు ఆసుపత్రుల సిబ్బంది మరియు స్థానిక ప్రజా ప్రతినిధులను కృతజ్ఞతలు తెలిపారు స్థానిక ప్రజలు రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిలర్లు పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్