తెలంగాణ

రీ-సర్వేలో భాగంగా రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ

రీ-సర్వేలో భాగంగా రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ

జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వేలో భాగంగా రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం తాళ్లరేవు మండలం పటవల, పి మల్లవరం గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై రైతులకు నూతన పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వేలో అనేక తప్పిదాలు జరిగాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. రైతుల భూ హక్కులకు భరోసా కల్పించేలా రాజముద్రతో కూడిన నూతన పాసుపుస్తకాలు ఇస్తున్నామని, రెవెన్యూ సేవలను సులభతరం చేసి భూ హక్కులకు శాశ్వత భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బిజెపి మండల అధ్యక్షులు విజయకుమార్ సీనియర్ నాయకులు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్