జనం న్యూస్ అక్టోబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేపీహెచ్‌బీలోని బతుకమ్మ కుంట పార్కులో సరస్వతి ఆహ్వానం మేరకు, కేపీహెచ్బీలో రంగమోనా మరియు అరవింద్ రెడ్డి ఆహ్వానం మేరకు, బాలాజీనగర్‌లో రాజేష్ గౌడ్ ఆహ్వానం మేరకు, అల్లాపూర్‌లో లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్ పాల్గొన్నారు.అలాగే వివేకానంద నగర్ కాలనీలో వేముల సత్యం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించి, బతుకమ్మ ఆడిన మహిళలకు ప్రైజ్ మనీ అందజేశారు. బేగంపేటలో శృంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు అని తెలిపారు. మహిళలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ నాయకులు, డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.