తెలంగాణ

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు కూకట్‌పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు కూకట్‌పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

జనం న్యూస్ అక్టోబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు.ఈ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు దంపతులు, యామిని పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు. పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పండుగ వాతావరణం ప్రతిబింబించింది. సాంప్రదాయ పాటలు, కోలాటాలు, బతుకమ్మ ఆటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఈ వేడుకలు చాటిచెప్పాయి.

ఇ-పేపర్