అంగ వైకల్య విద్యార్థికి స్కూటీ పంపణి

June 26, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి వికలాంగుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ గత నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ నంచర్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా నంచర్ల గ్రామానికి చెందిన బుర్ర హారిక మంత్రి ని కలిసి నేను పేద కుటుంబానికి చెందిన వికలాంగురాలును వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పిజి చదువుతున్నాను నాకు చదువుల నిమిత్తం వెళ్లడానికి రావడానికి ఇబ్బందిగా ఉన్నది కావున నాకు స్కూటీ ఇప్పించండి అని కోరగా మంత్రివర్యులు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా హారిక కు స్కూటీ ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు నంచర్ల లోని ఆమె ఇంటికి స్కూటీ (త్రీ వీలర్ ) స్కూటి పంపించగా అట్టి స్కూటీని ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం హారిక మాట్లాడుతూ నాకు స్కూటీ కావాలని మంత్రి ని కోరిన వెంటనే అధికారులకు ఆదేశించి స్కూటీ ఇప్పించినందుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు అలాగే చైర్మన్ మాట్లాడుతూ వికలాంగులశ్రేయస్సుకోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంచర్ల ఉపసర్పంచ్ ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డి వార్డు సభ్యులు మేక రాయమల్లుస్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పోడేటి గంగాధర్ లింగాల తిరుపతి వడ్లూరి నరేష్ బుర్ర సంపత్ కుమార్ హారిక తండ్రి సత్యం పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper