గాడిలంకలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ప్రారంభం
జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంగాడిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన దాత సూర్య వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు పాల్గొన్నారు.