జీలుగుల గ్రామంలో విషాదం – కెక్కర్ల శ్రీనివాస్ మృతికి క్లాస్‌మేట్స్, ఆటో యూనియన్,సంతాపం

August 25, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగష్టు 25 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జీలుగుల గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. జీలుగుల గ్రామానికి చెందిన కెక్కర్ల శ్రీనివాస్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.మంగళవారం నిర్వహించిన శ్రీనివాస్ అంత్యక్రియలకు SSC 1987–88 బ్యాచ్ క్లాస్‌మేట్స్‌తో హాజరై కన్నీటి నివాళులు అర్పించారు. తోటి విద్యార్థులు మాట్లాడుతూవిద్యార్థి దశ నుంచే శ్రీనివాస్ అందరితో కలిసిమెలిసి ఉండేవారని, తరగతి గదిలో తన మాటలు, పాటలతో తోటి విద్యార్థులను నవ్విస్తూ ఉత్సాహంగా ఉండేవారని క్లాస్‌మేట్స్ గుర్తు చేసుకున్నారు. మంచి గాయకుడిగా, స్నేహశీలిగా, అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
ఎప్పుడూ తమతో నవ్వుతూ, పాటలు పాడుతూ ఉండే మంచి మిత్రుడు ఈరోజు తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని క్లాస్‌మేట్స్,ఆటో యూనియన్స్, మాజీ ప్రధాన కార్యదగర్శి బండి కుమారస్వామి, రావుల రాజ్జన,పల్లె శ్రీధర్, పంజలా సూది, పబ్బు రవి,పల్లె భాస్కర్, కుక్కలా కిరణ్, పెండ్యాల కుమారస్వామీ రావుల శ్రీనివాస్, గుండాల మధు, తతితరులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు

🌐 Select Language:
📰 ePaper