అక్రమ అరెస్ట్ అపాలి బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివ

August 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ముందస్తుగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ను అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన లో విద్యార్థులు తీవ్ర మనోవేదన కు గురవుతున్నారని ఫీజు రీఎంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అవి వెంటనే విడుదల చేయాలని మండిపడ్డారు బీఆర్ఎస్ కనీసం విద్యార్థుల సమస్యలపై పోరాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తున్నారని రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురవు తున్నారని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు అని రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విద్యార్థులు ప్రజలు యువకుల రైతుల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర పరాజయం పొందుతుందని ఎద్దేవా చేశారు ఈ అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది ప్రజా పాలన కొనసాగించాలని కోరారు…

🌐 Select Language:
📰 ePaper