అమెరికా పర్యటనకు బయలుదేరిన నర్సింగరావు–సంగీత దంపతులకు ఘన సన్మానం

August 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నర్సింగరావు–సంగీత దంపతులు అమెరికా పర్యటనకు బయలుదేరుతున్న సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపిస్తూ నర్సింగరావు–సంగీత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆత్మీయ మిత్రులు, కమిటీ సభ్యులు అమెరికా పర్యటనకు వెళ్తుండటం సంతోషంగా ఉందని అన్నారు. విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జి. ప్రసాద్, శ్రీధర్, వెంకటరాజు, కుమార్, గణేష్, మురళి, లక్ష్మణ్, సూర్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొని నర్సింగరావు–సంగీత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper